కొత్తవుడియంలో భూ తగాదా

ABN , First Publish Date - 2020-07-20T12:05:19+05:30 IST

మండలంలోని కొత్తవుడియంలో ఆదివారం రెండు కుటుంబాల మధ్య జరిగిన భూ తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కొత్తవుడియంలో భూ తగాదా

ఇద్దరికి గాయాలు


బి.కొత్తకోట, జూలై 19: మండలంలోని కొత్తవుడియంలో ఆదివారం రెండు కుటుంబాల మధ్య జరిగిన భూ తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  కొత్తవుడియానికి చెందిన కదిరప్ప, జయచంద్ర కుటుంబాల మధ్య  భూ వివాదం జరిగింది.  ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో ఒక వర్గానికి భార్యాభర్తలు కదిరప్ప, సుజాతపై మరోవర్గం కొడవలితో దాడి చేశారు. ఈ తగాదాలో కదిరప్ప తలకు తీవ్ర గాయం కావడంతో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-20T12:05:19+05:30 IST