అమరవీరులకు లాల్‌సలాం
ABN , First Publish Date - 2020-06-18T11:05:44+05:30 IST
లద్ధాఖ్‌లో వీరమరణం పొందిన భారత జవాన్లకు బుధవారం జిల్లా అంతటా నివాళులర్పించారు.
తిరుపతి (యశోదనగర్/తిలక్‌రోడ్/ పద్మావతినగర్/ విశ్వవిద్యాలయాలు)/చంద్రగిరి, జూన్ 17: లద్ధాఖ్‌లో వీరమరణం పొందిన భారత జవాన్లకు బుధవారం జిల్లా అంతటా నివాళులర్పించారు. తిరుపతిలోని అమరవీరుల స్థూపం వద్ద జవాన్ల చిత్రపటాలను, జాతీయ జెండాను బీజేపీ నాయకులు ప్రదర్శిస్తూ జోహార్లు అర్పించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు మునిసుబ్రమణ్యం, మాజీ నగర అధ్యక్షుడు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జెన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రాజేష్, భానుప్రకాష్‌రెడ్డి, సి.కిరణ్‌కుమార్, భవానీశంకర్, వివిధ క్రీడాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చిత్రపటాలను దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో జవాన్ బి.సంతోష్ చిత్రపటానికి దిండికుర్తి నరసింహులు కార్యదర్శి శ్రీధర్, హేమచంద్రకుమార్, వెంకటేష్‌గుప్తా, నాగరాజు, శ్రీరాములు, సురేష్ తదితరులు నివాళులర్పిం చారు. న్యాయపరిరక్షణ చైతన్య సమితి, జైహిందూస్థాన్ పార్టీ నేతలు మేడా లోకేష్‌బాబు, బోడగలమునిబాబు ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద ఏపీ జేఏసీ జిల్లా నేత కోటగారం మురళి నివాళులర్పించారు.