శ్రీవాణి భక్తులకు లఘుదర్శనం

ABN , First Publish Date - 2020-12-28T06:52:04+05:30 IST

శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఆదివారం కులశేఖరపడి(లఘు) వరకు అనుమతించి దర్శనం చేయించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

శ్రీవాణి భక్తులకు లఘుదర్శనం

తిరుమల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఆదివారం కులశేఖరపడి(లఘు) వరకు అనుమతించి దర్శనం చేయించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించాలనే ఉద్దేశంతో లఘు దర్శన విధాన్ని రద్దు చేసి మహాలఘు(జయవిజయలు వరకు)ను అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం రద్దీ తగ్గడంతో శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరిగి ప్రాఽధాన్యం ఇస్తూ దాదాపు 1,500 మందికి లఘులో సంతృప్తికరంగా దర్శనం చేయించారు. 

Read more