కాణిపాకంలో జనవరి 1న లఘు దర్శనమే

ABN , First Publish Date - 2020-12-30T06:22:48+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి1న నిరాడంబరంగా స్వామి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఈవో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కాణిపాకంలో జనవరి 1న లఘు దర్శనమే

ప్రముఖులకు ప్రత్యేక దర్శనం ఉండదు


పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారికి దర్శనం రద్దు


ఐరాల(కాణిపాకం), డిసెంబరు 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి1న నిరాడంబరంగా స్వామి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఈవో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యూ ఇయర్‌ పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉండటంతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు, దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు  వేకువ జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శన భాగ్యం కల్పించనున్నారు. భక్తులు తప్పక కరోనా నిబంధనలు పాటించాలని, పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల ఆలయ ప్రవేశానికి అనుమతించమని చెప్పారు. ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించడానికి మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక దర్శనాలను కల్పించడం లేదన్నారు. కాణిపాకం వచ్చే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను వినాయక సదన్‌ వద్ద ఉన్న కొబ్బరి తోట వద్ద, బస్సులు, కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఆలయ డార్మెటరీ వద్ద పార్కింగ్‌ చేసి పోలీసులకు సహకరించాలన్నారు. వసతి గృహాలు అవసరం ఉన్న వారు 31న సాయంత్రం 5 గంటల లోపు బుక్‌ చేసుకోవాలని ఈవో సూచించారు.


Updated Date - 2020-12-30T06:22:48+05:30 IST