ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ శ్రీకాంత్‌ గుండె పోటుతో మృతి

ABN , First Publish Date - 2020-12-30T05:42:32+05:30 IST

కుప్పం ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ శ్రీకాంత్‌ (54) గుండె పోటుతో మృతిచెందారు. సోమవారం రాత్రి స్థానిక రైల్వే స్టేషన్‌ ప్రాంగణానికి భార్యతో కలిసి వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు.

ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ శ్రీకాంత్‌ గుండె పోటుతో మృతి
డీఈ శ్రీకాంత్‌ (ఫైల్‌ ఫొటో)

కుప్పం, డిసెంబరు 29: కుప్పం ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ శ్రీకాంత్‌ (54) గుండె పోటుతో మృతిచెందారు. సోమవారం రాత్రి స్థానిక రైల్వే స్టేషన్‌ ప్రాంగణానికి భార్యతో కలిసి వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు ఆయన్ను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం పీఈఎస్‌కు తరలించారు.  అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలం మదనపల్లెకు తరలించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆయన ఉద్యోగ రీత్యా చిత్తూరు జిల్లాకు వచ్చి మదనపల్లెలో స్థిర పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది.

Updated Date - 2020-12-30T05:42:32+05:30 IST