ఈ తల్లులకు సామాజిక దూరమేదీ?

ABN , First Publish Date - 2020-03-24T10:52:04+05:30 IST

కుప్పం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఉదయం 11 గంటల వేళ కనిపించిన దృశ్యమిది. ప్రసవం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందడానికి ఓపీ కౌంటర్‌ వద్ద నవజాత శిశువులను ఒడిలో పెట్టుకుని క్యూకట్టిన పచ్చిబాలింతలు, వారి సహాయకులు వీరు. మూడు మీటర్లు కాదు కదా.. కనీసం అంగుళం కూడా సామాజిక దూరం వారిమధ్య లేనేలేదు.

ఈ తల్లులకు సామాజిక దూరమేదీ?

కుప్పం, మార్చి 23: కుప్పం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఉదయం 11 గంటల వేళ కనిపించిన దృశ్యమిది. ప్రసవం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందడానికి ఓపీ కౌంటర్‌ వద్ద నవజాత శిశువులను ఒడిలో పెట్టుకుని క్యూకట్టిన పచ్చిబాలింతలు, వారి సహాయకులు వీరు. మూడు మీటర్లు కాదు కదా.. కనీసం అంగుళం కూడా సామాజిక దూరం వారిమధ్య లేనేలేదు. కరోనా విజృంభిస్తున్న వేళ.. అసలే బలహీనంగా ఉన్న ఈ తల్లులు, నవజాత శిశువులను ప్రమాదకర రీతిలో ఇలా ఎలా పక్కపక్కనే కూచోబెట్టడం లేదా నిలబెట్టడం చేశారో తెలియదు. అదీ ఎటువంటి రోగులొస్తున్నారో, వెళ్తున్నారో తెలియని ఆస్పత్రి ఆవరణలో. ఆస్పత్రి సిబ్బంది వచ్చి ఆ ఫొటోలేవో తీసేదాకా పాపమా తల్లులు.. నవజాత శిశువులతోపాటు ఇలాగే గంటల తరబడి పడిగాపులు కాశారు. 

Read more