సరదాపడి.. ఈతాడి

ABN , First Publish Date - 2020-03-02T10:48:29+05:30 IST

మదనపల్లె మండల పరిధిలోని హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణాజలాలు పారుతున్నాయి. నిన్నటి వరకు ప్రవాహం మందగించినా ప్రస్తుతం జోరందుకుంది.

సరదాపడి.. ఈతాడి

మదనపల్లె మండల పరిధిలోని హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణాజలాలు పారుతున్నాయి. నిన్నటి వరకు ప్రవాహం మందగించినా ప్రస్తుతం జోరందుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో చిప్పిలి సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ వద్దకు సమీపప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు. దీంతో హంద్రీ-నీవా గట్టు, కాలువ ప్రాంతంలో సందడి నెలకొంది. పిల్లలు, యువకులు ఆనందంగా ఈతాడుతూ సంబరపడ్డారు. పలువురు మహిళలు పిల్లలకు ఈతనేర్పుతూ సరదాపడ్డారు. కాలువ ప్రవాహం పెరిగితే వారంరోజుల్లో చిప్పిలి ట్యాంకు నిండనుంది. ఆ సమయంలో లోతైనప్రాంతానికి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పర్యవేక్షించాల్సి ఉందని అంటున్నారు. 

                                 - మదనపల్లె రూరల్‌ 

Updated Date - 2020-03-02T10:48:29+05:30 IST