కోవిడ్-19 కేంద్రంగా..కార్వేటినగరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్
ABN , First Publish Date - 2020-05-17T10:59:45+05:30 IST
కార్వేటినగరంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కోవిడ్-19 కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ అమరేంద్రబాబు

కార్వేటినగరం, మే 16: కార్వేటినగరంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కోవిడ్-19 కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ అమరేంద్రబాబు శనివారం తెలిపారు. మండలంలో ఎవరైనా కరోనా వైరస్ బారిన పడితే వారికి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకుగాను ముందస్తు జాగ్రత్తగా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. ఎంపీడీవో చిన్నరెడ్డెప్ప, వైద్యాధికారిణి శ్రీలత, జిల్లా వైసీపీ కార్యదర్శి బాలాజీనాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.