‘కొలకలూరి’ పురస్కారాల కోసం గ్రంథాలు పంపండి

ABN , First Publish Date - 2020-12-29T05:07:29+05:30 IST

‘కొలకలూరి పురస్కారాలు-2021’ కోసం 2019 జనవరి తర్వాత ప్రచురితమైన మూడు గ్రంథాలను పంపాలని నిర్వాహకులు ప్రొఫెసర్‌ కొలకలూరి మధుజ్యోతి, ప్రొఫెసర్‌ కొలకలూరి సుమకిరణ్‌ కోరారు.

‘కొలకలూరి’ పురస్కారాల కోసం గ్రంథాలు పంపండి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 28: ‘కొలకలూరి పురస్కారాలు-2021’ కోసం 2019 జనవరి తర్వాత ప్రచురితమైన మూడు గ్రంథాలను పంపాలని నిర్వాహకులు ప్రొఫెసర్‌ కొలకలూరి మధుజ్యోతి, ప్రొఫెసర్‌ కొలకలూరి సుమకిరణ్‌ కోరారు. ఈ గ్రంథాలను వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ లోపు పంపాలని సూచించారు. కవిత్వం, నాటక ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలను ‘ప్రొఫెసర్‌ కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖాధ్యక్షులు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి (ఫోను నెంబరు 94419 23172)’  చిరునామాకు.. పరిశోధనా గ్రంథాలను ‘ప్రొఫెసర్‌ కొలకలూరి సుమకిరణ్‌, ఆంగ్ల విభాగం, ఎస్వీ విశ్వవిద్యాలయం, తిరుపతి (ఫొనో నెంబరు 99635 64664)’ చిరునామాకు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు. న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి 2021 ఫిబ్రవరి 26న హైదరాబాదులో నిర్వహించే సభలో పురస్కారాలను ప్రదానం చేస్తామని  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాలను 13 ఏళ్లుగా ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ కవితా సంపుటికి కొలకలూరి భాగీరథి పురస్కారం కింద రూ.15 వేలు, ఉత్తమ నాటకానికి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం కింద రూ.15 వేలు, ఉత్తమ పరిశోధనా గ్రంథానికి కొలకలూరి రామయ్య పురస్కారం కింద రూ.15 వేలు అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 

Updated Date - 2020-12-29T05:07:29+05:30 IST