సీటీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికైన కేఈసీ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-12-29T05:16:15+05:30 IST

కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో సోమవారం క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీటీఎస్‌ (కాగ్నిజంట్‌ టెక్నాలజీ సర్వీస్‌) హెచ్‌ఆర్‌ ప్రతినిధులు, ఎన్‌జీటీ (నేషనల్‌ క్వాలిఫైయింగ్‌ టెస్టు ) ద్వారా నిర్వహించిన ఈ ఇంటర్వ్మూల్లో 19 మంది కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు అర్హత సాధించి సీటీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కేఈసీ చైర్మన్‌ బీసీ.నాగరాజ్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సునీల్‌రాజ్‌లు తెలిపారు.

సీటీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికైన కేఈసీ విద్యార్థులు
సీటీఎస్‌కు ఎంపికైన విద్యార్థులతో బీసీ.నాగరాజ్‌ తదితరులు

కుప్పం, డిసెంబరు 28: కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో సోమవారం క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీటీఎస్‌ (కాగ్నిజంట్‌ టెక్నాలజీ సర్వీస్‌) హెచ్‌ఆర్‌ ప్రతినిధులు, ఎన్‌జీటీ (నేషనల్‌ క్వాలిఫైయింగ్‌ టెస్టు ) ద్వారా నిర్వహించిన ఈ ఇంటర్వ్మూల్లో 19 మంది కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు అర్హత సాధించి సీటీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కేఈసీ చైర్మన్‌ బీసీ.నాగరాజ్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సునీల్‌రాజ్‌లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 4.5 లక్షల వార్షిక వేతనం ఉంటుందని వివరించారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేఈసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ భాస్కరన్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:16:15+05:30 IST