88 వేలకు చేరువైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-19T06:57:27+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు 88 వేలకు చేరువయ్యాయి.

88 వేలకు చేరువైన కరోనా కేసులు

తిరుపతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు 88 వేలకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 98మందికి వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 87970కి చేరుకుంది. శుక్రవారం ఉదయానికి యాక్టివ్‌ వైరస్‌ బాధితులు 461మంది వున్నట్టు అధికారులు ప్రకటించారు. తాజాగా నిర్ధారించిన 98 కేసుల్లో తిరుపతి నగరంలో 46, తిరుపతి రూరల్‌ మండలంలో 10, చిత్తూరు, శ్రీకాళహస్తి మండలాల్లో 8 చొప్పున, మదనపల్లెలో 7, చంద్రగిరి, పలమనేరు మండలాల్లో 3 చొప్పున, కలికిరి, పుంగనూరు, పుత్తూరు, శ్రీరంగరాజపురం మండలాల్లో 2 చొప్పున, కలకడ, కుప్పం, పాకాల, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Read more