రూ.1.07లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-07T07:04:42+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులకు అందిన రహస్య సమాచారంతో తిరుపతి ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం స్థానిక జీవకోనలోని ఓ ఇంటిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

రూ.1.07లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం
పట్టుబడిన నిందితుడు, స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్‌ పోలీసులు5

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 6: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులకు అందిన రహస్య సమాచారంతో తిరుపతి ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం స్థానిక జీవకోనలోని ఓ ఇంటిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 1,536 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. మద్యాన్ని అక్రమంగా నిల్వచేసిన మునస్వామిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1,07,520  ఉంటుందని ఎక్సైజ్‌ సీఐ ధీరజ్‌రెడ్డి తెలియజేశారు. ఈ దాడిలో ఎస్‌ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుళ్లు కవీశ్వర్‌నాయుడు, రవి, గుర్రప్ప, కానిస్టేబుళ్లు నవీన్‌, సుధాకర్‌, వైకుంఠరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T07:04:42+05:30 IST