రూ.3.75 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-06T05:13:51+05:30 IST

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

రూ.3.75 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం
పట్టుబడిన మద్యం, నిందితులతో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

ఇద్దరి అరెస్టు


చిత్తూరు, డిసెంబరు 5: కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.75 లక్షల విలువైన మద్యం బాటిళ్లును, కారును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. బెంగళూరు-తిరుపతి రహదారిలోని డి.వెంగనపల్లె క్రాస్‌ వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇండికా కారును తనిఖీ చేయగా రూ.3.75లక్షల విలువైన 1104 కర్ణాటక మద్యం బాటిళ్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో యాదమరి మండలం కోణాపల్లె పంచాయతీ ఏఏడబ్ల్యూకి చెందిన టి.రాజా(35), గంగవరం మండలం గుండ్రాజుపల్లె పంచాయతీ పెద్దఉగినికి చెందిన సి.రెడ్డిప్రసాద్‌ను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-12-06T05:13:51+05:30 IST