కాణిపాకంలో వైభవంగా సుదర్శన హోమం

ABN , First Publish Date - 2020-04-26T10:53:28+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రబలకుండా శనివారం కాణిపాక ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయమైన ..

కాణిపాకంలో వైభవంగా సుదర్శన హోమం

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 25: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రబలకుండా శనివారం కాణిపాక ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి కోవెలలో సుదర్శన హోమం నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, మండపారాధన, విశ్వక్సేన పూజ, మృత్యుం జయ హోమం, కలశారాధన, సుదర్శన హోమం నిర్వహించారు. పూర్ణాహుతి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో దేముళ్లు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, వేదపండితులు సీహెచ్‌వీఎస్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-26T10:53:28+05:30 IST