కాణిపాకం ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2020-03-21T11:07:59+05:30 IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు.

కాణిపాకం ఆలయం మూసివేత

యధావిధిగా స్వామికి కైంకర్యాలు


       ఐరాల (కాణిపాకం), మార్చి 20: కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఉదయం నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు త్వరితగతిన స్వామి దర్శనం కల్పించి వెలుపలకు పంపించేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో దేముళ్లు తెలిపారు. స్వామికి నిత్య కైంకర్యాలు మాత్రం యధావిధిగా జరుగుతాయని తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు భక్తులను అనుమతించేది లేదని ఆ తర్వాత దేవదాయ శాఖ ఆదేశాలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. స్వామి దర్శనాన్ని నిలిపి వేయడంతో ఆలయ ప్రాంగణం, బస్టాండ్‌, దుకాణ సముదాయాలు జనం లేక బోసిపోయాయి. వ్యాపారాలు పూర్తిగా ఆగిపోవడంతో వ్యాపారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. భక్తులు సహకరించి కాణిపాకం యాత్రను రద్దు చేసుకోవాలని ఈవో  కోరారు. 

Updated Date - 2020-03-21T11:07:59+05:30 IST