కాణిపాకంలో వైభవంగా పున్నమి గరుడ సేవ
ABN , First Publish Date - 2020-12-30T18:20:24+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని..

ఐరాల(కాణిపాకం): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని వరదరాజస్వామి ఆలయంలో మంగళవారం పున్నమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం వరదరాజస్వామి మూల విరాట్‌కు ఘనంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజ, వ్రతాన్ని నిర్వహింపచేశారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ప్రాకారోత్సవం నిర్వహించారు. గరుడ వాహనధారుడైన స్వామిని దర్శించుకోవడానికి వందలాది భక్తులు తరలి వచ్చారు. ఆలయ ఈవో వెంకటేశు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్, కిషోర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.