కష్టాలు చెప్పలేక.. పరిష్కారం కాక

ABN , First Publish Date - 2020-09-01T09:43:38+05:30 IST

గతంలో ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరించి రెండు మాటలు మాట్లాడేవారు. కలెక్టరో.. జిల్లా అధికారులో తమతో మాట్లాడారన్న ఆనందం బాధితుల్లో కన్పించేది. ఇదీ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే స్పందన

కష్టాలు చెప్పలేక.. పరిష్కారం కాక

 ‘స్పందన’ బాధితుల ఆవేదన 


చిత్తూరు, ఆగస్టు 31: గతంలో ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరించి రెండు మాటలు మాట్లాడేవారు. కలెక్టరో.. జిల్లా అధికారులో తమతో మాట్లాడారన్న ఆనందం బాధితుల్లో కన్పించేది. ఇదీ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం తీరు. కరోనా పుణ్యమాని ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సోమవారం పలువురు బాధితులు కలెక్టరేట్‌ వచ్చారు. వ్యయప్రయాసల కోర్చి చిత్తూరు వచ్చినా ఉన్నతాధికారులకు కష్టాలను చెప్పుకోలేక పోయామని వాపోయారు. పలువురి వినతుల వివరాలిలా ఉన్నాయి. 


 వీధిని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్న స్థానికుడు సిద్ధప్పపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గంగవరం మండలం గండ్రాజుపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 


 కాంట్రాక్టు ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందని మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఆరోపించారు. 


 సచివాలయాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరపాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు కోరారు. పొలాల్లో పెంచే చెట్లను గృహావసరాల కోసం రైతులు టింబర్‌ డిపోలకు తరలిస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని గుర్తుచేశారు. 

Updated Date - 2020-09-01T09:43:38+05:30 IST