శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2020-12-26T07:57:17+05:30 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శుక్రవారం పలువురు న్యాయమూర్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
తిరుమల ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ అరవింద్‌ బోబ్డే

తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శుక్రవారం  పలువురు న్యాయమూర్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ బాబ్డే, న్యాయమూర్తి ఇందు మల్హోత్ర, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రాకేష్‌కుమార్‌, మానవేంద్రనాథ్‌రాయ్‌, వెంకటరమణ, దుర్గాప్రసాదరావు, రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ ఈశ్వరయ్య, ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ సీవీ నాగార్జునరెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్‌గౌడ్‌ వేకువజామున వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు.అలాగే  ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌,సమాచార శాఖ కమిషనర్‌ బీవీ రమణకుమార్‌, మంత్రులు ఆదిమూలపు సురేష్‌,బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు  రెడ్డెప్ప,గోరంట్ల మాధవ్‌,బ్రహ్మానందరెడ్డి, సత్యవతి, మోపిదేవి వెంకటరమణ,ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి,ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా,బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు,కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్‌ సహాయ్‌,రాష్ట్ర మాజీ మంత్రి చిన్నరాజప్ప, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌,తమిళనాడు మంత్రి కరుప్పనన్‌, సినీ నటులు హేమ, సురేఖ, ప్రేమ,అశోక్‌ తదితరులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.















Updated Date - 2020-12-26T07:57:17+05:30 IST