అయ్యోర్ల బదిలీలు ‘నవ్వుల’పాలు..!

ABN , First Publish Date - 2020-12-19T06:55:39+05:30 IST

అవును.. అయ్యోర్ల బదిలీలు ‘నవ్వుల’పాలవుతున్నాయి. ఖాళీల ‘బ్లాక్‌’ మ్యాజిక్‌తోపాటు బదిలీల సాఫ్ట్‌వేర్‌ వారిని పెడుతున్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో జోకులుగా మారిపోయాయి.

అయ్యోర్ల బదిలీలు ‘నవ్వుల’పాలు..!

   ‘ఇప్పుడు సర్వర్‌ చాలా బాగా పని చేస్తోంది. ఇంతకుముందు ఎర్రర్‌ అని రావడానికి కూడా గంట టైమ్‌ పట్టేది. ఇప్పుడు కొట్టగానే ఎర్రర్‌ అని వస్తోంది.. గుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌’ అని ఏడ్వలేక నవ్వుతాడు బ్రహ్మానందం.

    ’ఇవి టీచర్స్‌ వెబ్‌ ఆప్షన్స్‌లే వొదినా.. అందరికీ అర్థం కావం’టూ నవ్వుతాడు మాయాబజార్‌ శ్రీకృష్ణుడు. 

 అవును.. అయ్యోర్ల బదిలీలు ‘నవ్వుల’పాలవుతున్నాయి. ఖాళీల ‘బ్లాక్‌’ మ్యాజిక్‌తోపాటు బదిలీల సాఫ్ట్‌వేర్‌ వారిని పెడుతున్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో జోకులుగా మారిపోయాయి.  ఏరోజుకారోజు అర్ధరాత్రి దాకా వెబ్‌ ఆప్షన్లు పెట్టడానికి ప్రయత్నించి భంగపడడం.. చివరికా మర్రోజు అర్థరాత్రి దాకా గడువు పొడిగించామంటూ సర్కారు చూపించే కరుణకు ఊపిరి పీల్చుకోవడం తప్ప నిస్సహాయంగా మిగిలిపోతోంది ఉపాధ్యాయ లోకం. ఆగ్రహించినా, ఈ బదిలీల తికమకను ప్రశ్నించినా ఏమవుతుందో గతంలో కొంతమంది టీచర్లకు ఎదురైన అనుభవాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా భరిస్తోంది. కాకపోతే తమలో పెరిగిపోతున్న ఫ్రస్టేషన్‌ను ఆపుకోలేక జోక్‌లు, కార్టూన్ల రూపంలో సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతోంది. 

      - కుప్పం

Read more