స్వచ్ఛందంగా సమాచారమివ్వండి
ABN , First Publish Date - 2020-04-01T10:36:34+05:30 IST
జమాత్‌కు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా సమాచారమిస్తే క్వారంటైన్‌లో ఉంచుతామని కమిషనరు గిరీష పేర్కొన్నారు. విజయవాడ నుంచి మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు, సీడీఎంఏ విజయకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భరత్‌గుప్తా, తిరుపతి నుంచి కమిషనరు గిరీష పాల్గొన్నారు.

‘జమాత్’ నుంచి వచ్చిన వారికి కమిషనర్ విజ్ఞప్తి
తిరుపతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జమాత్‌కు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా సమాచారమిస్తే క్వారంటైన్‌లో ఉంచుతామని కమిషనరు గిరీష పేర్కొన్నారు. విజయవాడ నుంచి మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు, సీడీఎంఏ విజయకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భరత్‌గుప్తా, తిరుపతి నుంచి కమిషనరు గిరీష పాల్గొన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జమాత్‌కు వెళ్లిన వారి గుర్తింపుపై కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కమిషనరు గిరీష మాట్లాడుతూ.. తిరుపతి నుంచి నలుగురు ఢిల్లీకి వెళ్లొచ్చినట్లు తెలిసిందన్నారు. వీరిలో ఒకరు జమాత్‌కు వెళ్లగా, ముగ్గురు సొంత పనులు నిమిత్తం వెళ్లినట్టు చెప్పారన్నారు. వారు, వారి కుటుంబీకులనూ క్వారంటైన్‌కు పంపామన్నారు.
వీళ్లుకాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అని వార్డు కార్యదర్శులు, వలంటీర్లు గుర్తించే పనిలో ఉన్నారన్నారు. ముస్లిం మతపెద్దలతో మాట్లాడామని, వారూ ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించే పనిలో ఉన్నారన్నారు. విదేశాల నుంచి వచ్చిన 667 మందిని ముందుగానే గుర్తించి హోమ్ క్వారంటైన్ చేశామన్నారు. వారి చేతికి స్టాంప్ వేసి, ఇంటి ముందు స్టిక్కర్ అతికించడం ద్వారా బయట తిరిగేందుకు వీల్లేకుండా చేశామన్నారు. వీరిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. వీరి ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుపతిలో చేపట్టిన చర్యల గురించి గిరీష వివరించారు. అదనపు కమిషనర్ హరిత, ఉపకమిషనర్ చంద్రమౌళేశ్వరరెడ్డి, ఎస్‌ఈ ఉదయకుమార్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఆరోగ్య శాఖాధికారి సుధారాణి పాల్గొన్నారు.