అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-06-25T11:23:06+05:30 IST

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. తాలూకా

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని  మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ

కేసు దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు


మదనపల్లె క్రైం, జూన్‌ 24: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవారిపల్లె పంచాయతీ పాళెంకొండకు చెందిన శివశంకర్‌కు వాల్మీకిపురం మండలం గొల్లపల్లెకు చెందిన శిరీష(20)తో ఏడాది కిందట వివాహమైంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న శిరీషను కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆటోలో మదనపల్లె లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ  సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఘటనపై ఆరా తీశారు.


అయితే శివశంకర్‌, కుటుంబీకులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారు శిరీష తల్లిదండ్రులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త, అత్తామామలు తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శిరీష తల్లిదండ్రులు వెంకటరమణ, అరుణ ఆరోపించారు. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ తండ్రి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-25T11:23:06+05:30 IST