దోర్ణాదుల సిద్ధార్థకు అంతర్జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2020-08-16T09:53:43+05:30 IST

పలమనేరుకు చెందిన కవి దోర్నాదుల సిద్ధార్థకు అంతర్జా తీయ పురస్కారం లభించిందని పలమనేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పలమనేరు

దోర్ణాదుల సిద్ధార్థకు అంతర్జాతీయ పురస్కారం

పలమనేరు, ఆగస్టు 15 : పలమనేరుకు చెందిన కవి దోర్నాదుల సిద్ధార్థకు అంతర్జా తీయ పురస్కారం లభించిందని పలమనేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పలమనేరు బాలాజీ తెలిపారు. నాటా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ‘నాదేశం- నా జెండా’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన కవితా పోటీల్లో దోర్ణాదుల సిద్ధార్థ కవితకు ప్రథమ పురస్కారంతో బాటు రూ. 20 వేలు నగదు బహుమతి కూడా లభించిందన్నారు.


913 మంది తమ కవితలను ఈ పోటీకి పంపగా అందులో సిద్ధార్థకు మొదటి బహుమతి లభించిందని మరో 8 మందికి పురస్కారాలు లభించాయని వివరించారు.  ఈ సందర్భంగా దోర్నాదుల సిద్ధార్థను పలమనేరు రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాధవ్‌, బాలాజీ, తులసీనాథం నాయుడు, గిరిధరమూర్తి, శ్రీపురం సీతారామయ్య తదితరులు అభినందించారు.  

Updated Date - 2020-08-16T09:53:43+05:30 IST