-
-
Home » Andhra Pradesh » Chittoor » Increased electricity charges should be reduced
-
పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలి
ABN , First Publish Date - 2020-05-13T10:41:25+05:30 IST
పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు డిమాండ్

సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన
తిరుపతి (ఆటోనగర్), మే 12: పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం భౌతిక దూరం పాటిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నాయకులు పెంచలయ్య, విశ్వనాథ్, రాధాకృష్ణ, జనార్దన్, రామచంద్రయ్య, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.