శ్రీబాలాజీ వైద్యకళాశాల ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-26T06:00:22+05:30 IST

రేణిగుంట విమానాశ్రయం రహదారిలో శ్రీబాలాజీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని బుధవారం రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

శ్రీబాలాజీ వైద్యకళాశాల ప్రారంభం
శ్రీబాలాజీ మెడికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు

రేణిగుంట, నవంబరు 25: రేణిగుంట విమానాశ్రయం రహదారిలో శ్రీబాలాజీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని బుధవారం రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీబాలాజీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో వైద్యసేవలు రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. 350 పడకలతో అధునాతనమైన పరికరాలతో పేదలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. కళాశాల, ఆస్పత్రి సీఈవో పాణిగ్రహి, తదితరులు ప్రసంగించారు. మూడు రోజుల పాటు పేదలకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు. వైద్యసిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:00:22+05:30 IST