రూ.26లక్షలతో హార్సిలీహిల్స్‌ స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ భవనం అభివృద్ధి: ఆర్జేడీ

ABN , First Publish Date - 2020-09-20T10:59:02+05:30 IST

హార్సిలీహిల్స్‌లోని స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ భవనాన్ని రూ.26ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా

రూ.26లక్షలతో హార్సిలీహిల్స్‌ స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ భవనం అభివృద్ధి: ఆర్జేడీ

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 19: హార్సిలీహిల్స్‌లోని స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ భవనాన్ని రూ.26ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సమావేశ మందిరంలో జరిగిన స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.


ఆర్జేడీ మాట్లాడుతూ.. హార్సిలీ హిల్స్‌లోని భవనానికి ప్రహరీ, టాయిలెట్స్‌ నిర్మాణం, తాగునీటి పైపుల ఏర్పాటు తదితర పనులు చేయాలని సమగ్ర శిక్షా అధికారులను ఆదేశించారు. అనంతరం ఇక్కడున్న ట్రైనింగ్‌ సెంటర్‌లో రూ.6లక్షల పరికరాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లను ఆమోదించారు. డీఈవో నరసింహారెడ్డి, అధికారులు ఉమాదేవి, మోహన్‌రాం, అరుణ్‌కుమార్‌, ఢిల్లీబాబు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T10:59:02+05:30 IST