తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ‘హై 9 హీరోస్‌’ అవార్డు

ABN , First Publish Date - 2020-12-06T05:25:09+05:30 IST

సామాజిక, ఆరోగ్య సేవలకుగాను ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డికి ‘హై 9 హీరో’ అవార్డు లభించింది.

తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ‘హై 9 హీరోస్‌’ అవార్డు
రమేష్‌రెడ్డికి అవార్డు ప్రదానం చేస్తున్న చిరంజీవి

ప్రదానం చేసిన మెగాస్టార్‌ చిరంజీవి


తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 5: తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక ఆరోగ్య సేవల సంస్థ అవార్డు ‘హై 9 హీరో’ లభించింది. కరోనా సమయంలో ఎస్పీ చేసిన సామాజిక, ఆరోగ్య సేవలకుగాను ఈ అవార్డు వరించింది. శనివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఎస్పీ ఈ అవార్డును అందుకున్నారు. కాగా.. కరోనా సమయంలో అందించిన సేవలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కోచ్‌ అవార్డును కూడా ఎస్పీ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అవార్డు రావడంపై ఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-06T05:25:09+05:30 IST