చిత్తూరులో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-07-13T11:55:20+05:30 IST
నగరంలో శనివారం అర్ధరాత్రి రికార్డుస్థాయిలో భారీ వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు ..
చిత్తూరు కల్చరల్, జూలై 12: నగరంలో శనివారం అర్ధరాత్రి రికార్డుస్థాయిలో భారీ వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు పాట్లు పడ్డారు. భారీ వర్షాలకు నీవా నది ఉధ్రుతంగా ప్రవహించడంతో పలుప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. గిరింపేట విద్యుత్తు కార్యాలయ ఆవరణలోని పెద్ద చెట్టు కూలింది. ఎన్టీఆర్ జలాశయం, నగరపాలక సంస్థ పరిధిలోని కట్టమంచి, కాజూరు, గంగినేనిచెరువు, దుర్గానగర్ కాలనీ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మొత్తం మీద చిత్తూరు అర్చన్, రూరల్ పరిధిలో శనివారం 70 మి.మీ. వర్షపాతం నమోదైంది.