జేసీఐ జోన్-4 అధ్యక్షుడిగా హర్షవర్ధన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-12-14T05:09:08+05:30 IST
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి జేసీఐ జోన్-4 అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

పెనుమూరు, డిసెంబరు 13: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) జోన్-4 అధ్యక్షుడిగా మండలంలోని దాసరపల్లెకు చెందిన ఎన్.బి.హర్షవర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11న విశాఖపట్నం గ్రీన్‌పార్క్ హోటల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపిక ఏకగ్రీవమైంది. కాగా, ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. హర్షవర్ధన్ తండ్రి ఎన్బీ సుధాకర్‌రెడ్డి తిరుపతిలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు.