రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్
ABN , First Publish Date - 2020-12-13T06:44:09+05:30 IST
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను సోమవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు జరుగుతాయని ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.

కొత్తగా ట్యాబ్ ద్వారా పరీక్షలు: ఆర్డీవో
తిరుపతి(విద్య), డిసెంబరు 12: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను సోమవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు జరుగుతాయని ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శనివారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్ కేంద్రాల్లో జరిగే పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈఏడాది కొత్తగా ట్యాబ్ ద్వారా పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 893మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగానే చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. సెక్షన్ ఆఫీసర్లు మాధవీలత, అంజన, ఏవో సురేష్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.