వీర జవాన్ కుటుంబానికి గవర్నర్ సాయం
ABN , First Publish Date - 2020-12-08T04:53:58+05:30 IST
కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలను గవర్నర్ బిశ్వన్‌భూషణ్ హరిచందన్ మంజూరు చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశాయి.

ఐరాల, డిసెంబరు 7: కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలను గవర్నర్ బిశ్వన్‌భూషణ్ హరిచందన్ మంజూరు చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ గత నెల 8న ఉగ్రదాడిలో మృతిచెందిన సంగతి విదితమే. గవర్నర్ తన విచక్షణాధికారంతో రూ.2 లక్షల చెక్కును 18 మద్రాసు రెజిమెంట్ అధికారులకు అందజేశారు. ఈ నగదు ప్రవీణ్ భార్య రజిత ఖాతాకు నగదు బదిలీ కానుంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, డిఫెన్స్ అకౌంట్ ఉండడంతో పాటూరు స్టేట్‌బ్యాంకు తరపున బీమా సొమ్ము రూ.30 లక్షలు అందిన విషయం తెలిసిందే.