ఆరునెలల్లో వరసిద్ధుడికి స్వర్ణ రథం

ABN , First Publish Date - 2020-11-06T06:57:09+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మరో ఆరునెలల్లో స్వర్ణ రథం సిద్ధం కానుంది. స్వర్ణ నిర్మాణానికి అవసరమైన కొయ్య రఽథాన్ని ఆలయం వారు సిద్ధం చేశారు.

ఆరునెలల్లో వరసిద్ధుడికి స్వర్ణ రథం
కొయ్య రథాన్ని టీటీడీ అధికారులకు అప్పగిస్తున్న అధికారులు

టీటీడీకి కొయ్య రథాన్ని అందించిన ఆలయ అధికారులు

ఐరాల(కాణిపాకం), నవంబరు 5: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మరో ఆరునెలల్లో స్వర్ణ రథం సిద్ధం కానున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. స్వర్ణ నిర్మాణానికి అవసరమైన కొయ్య రఽథాన్ని కాణిపాక ఆలయం వారు సిద్ధం చేశారు. ఆ కొయ్య రథం వద్ద బంగారు తాపడం పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా రథ నిర్మాణం జరగాలని పలు పూజలు నిర్వహించారు. అనంతరం కొయ్య రథాన్ని టీటీడీ అధికారులకు అప్పగించారు. కాగా ఆలయానికి స్వర్ణ రథ నిర్మాణం కోసం టీటీడీకి గతంలో రూ.6 కోట్లు చెల్లించిన విషయం తెలిందే. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T06:57:09+05:30 IST