పద్మావతి అమ్మవారికి బంగారు నెక్లెస్‌ కానుక

ABN , First Publish Date - 2020-11-07T05:22:30+05:30 IST

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి ఓ దాత రూ.5.7 లక్షల బంగారు నెక్లెస్‌ సెట్‌ను బహూకరించారు.

పద్మావతి అమ్మవారికి బంగారు నెక్లెస్‌ కానుక
బంగారు నెక్లెస్‌ సెట్‌

తిరుచానూరు, నవంబరు 6: రాజమండ్రికి చెందిన చందన రమేష్‌ శుక్రవారం అమ్మవారి ఆలయంలో డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, అర్చకులు బాబుస్వామికి 106 గ్రాములు గల బంగారు నెక్లెస్‌ సెట్‌ను అందించారు. దాతకు అమ్మవారి దర్శనం గావించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పేష్కార్‌ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్‌ మధు, రాజేష్‌ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-07T05:22:30+05:30 IST