-
-
Home » Andhra Pradesh » Chittoor » gods gift to pranadanamscheme
-
‘ప్రాణదాన పథకం’ దేవుడిచ్చిన వరం
ABN , First Publish Date - 2020-12-27T06:33:05+05:30 IST
స్విమ్స్ ఆస్పత్రిలో పేద రోగులకు అందిస్తున్న టీటీడీ ప్రాణదాన పథకం దేవుడిచ్చిన వరంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

స్విమ్స్‌లోని కేన్సర్ రోగులతో
టీటీడీ చైర్మన్ ముఖాముఖి
తిరుపతి (వైద్యం), డిసెంబరు 26: స్విమ్స్ ఆస్పత్రిలో పేద రోగులకు అందిస్తున్న టీటీడీ ప్రాణదాన పథకం దేవుడిచ్చిన వరంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్రం ఆయన స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ముందుగా కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ను పరామర్శించారు. అక్కడి నుంచి కేన్సర్ విభాగాలైన మెడికల్, సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీలను పరిశీలించారు. ఆ తర్వాత పద్మావతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కేన్సర్ రోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శస్త్ర చికిత్సలయ్యాక ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్విమ్స్‌కు అన్ని విధాలా టీటీడీ సహకరిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 20,763 మంది పేద రోగులు ప్రాణదాన పథకం ద్వారా వైద్యసేవలు పొందారన్నారు. దీనికోసం రూ.107 కోట్ల 30లక్షలు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.