అత్యవసర వైద్యసేవలకు సిద్ధంకండి

ABN , First Publish Date - 2020-03-31T12:23:11+05:30 IST

కరోనా వైరస్‌కు సంబంధించి ప్రజలకు ముందస్తు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటు డాక్టర్లు

అత్యవసర వైద్యసేవలకు సిద్ధంకండి

ప్రైవేటు డాక్టర్లకు జిల్లా వైద్యాధికారులు పిలుపు


తిరుపతి (వైద్యం), మార్చి 30: కరోనా వైరస్‌కు సంబంధించి ప్రజలకు ముందస్తు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటు డాక్టర్లు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య పిలుపునిచ్చారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైద్య సేవలు’ అంశంపై సోమవారం స్విమ్స్‌లో ప్రైవేటు డాక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు ఎలా ఇవ్వాలి, ప్రొటోకాల్‌ వైద్య సేవలు, ప్రభుత్వ సూచనల ప్రకారం వైద్యం అందించడంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.


వెంటిలేటర్లున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమానులు అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ కేర్‌ అందించాలన్నారు. ప్రైవేటు వైద్యులతో పాటు నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మశీ.. శానిటేషన్‌ సిబ్బంది కూడా అత్యవసర వైద్యసేవల విధుల్లో ఉండాలన్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సరళమ్మ, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ అరుణ సులోచన, డాక్టర్‌ జనార్దన్‌రాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరిరావు, నాయకులు డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్‌ బలరాంరాజు, డాక్టర్‌ శ్రీనివాస రావు, డాక్టర్‌ కృష్ణప్రశాంతి, డాక్టర్‌ రవిరాజు, డాక్టర్‌ యుగంధర్‌, డాక్టర్‌ మధుసూదన్‌ కొండేటి, డాక్టర్‌ రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-31T12:23:11+05:30 IST