గరిడీమిట్ట స్థలం ఆక్రమణ యత్నం

ABN , First Publish Date - 2020-06-23T10:27:15+05:30 IST

శ్రీకాళహస్తి పట్టణం జయరామరావువీఽధి రంగయ్యబడికి సమీపంలో ఉన్న గరిడీమిట్ట స్థలం కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నాలు ..

గరిడీమిట్ట స్థలం ఆక్రమణ యత్నం

శ్రీకాళహస్తి, జూన్‌ 22: శ్రీకాళహస్తి పట్టణం జయరామరావువీఽధి రంగయ్యబడికి సమీపంలో ఉన్న గరిడీమిట్ట స్థలం కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఓ వర్గం ఈ స్థలం తమదేనంటూ ఆక్రమణకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కు మళ్లారు. ఇదే అదనుగా మరో వర్గం తమ పలుకుబడిని వినియోగించి కబ్జా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ స్థలం రూ.లక్షలు  విలువ చేస్తుంది.


పూర్వకాలంలో ఈ స్థలంలో రాజులు వ్యాయామశాల నిర్మించారు. ప్రస్తుతం ఆ స్థలం పురపాలక సంఘ పరిధిలో ఉంది. ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణ యత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్థలంలో వ్యాయామశాల నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది. పురపాలక సంఘ అధికారులు స్పందించి ఈ స్థలం ఆక్రమణ కాకుండా చూడాల్పిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వ్యాయామశాల నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

Read more