సచివాలయ ఫర్నిచర్‌ ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-30T05:04:46+05:30 IST

విధి నిర్వహణకు హాజరు కాలేదంటూ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో అడ్మిన్‌ నమోదు చేయడంపై ఆగ్రహించిన వలంటీర్లు సచివాలయ సామగ్రిని ధ్వంసం చేశారు

సచివాలయ ఫర్నిచర్‌ ధ్వంసం
సచివాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన వలంటీర్లు

ముగ్గురు వలంటీర్లపై కేసు నమోదు


పుత్తూరు, డిసెంబరు 29: విధి నిర్వహణకు హాజరు కాలేదంటూ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో అడ్మిన్‌ నమోదు చేయడంపై ఆగ్రహించిన వలంటీర్లు సచివాలయ సామగ్రిని ధ్వంసం చేశారు. నగరి మండలం తడుకుపేట సచివాలయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. దీనిపై సచివాలయ కార్యదర్శి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్లు జనార్దన్‌, కార్తీక్‌, ప్రవీణ్‌ విధులకు హాజరు కాకపోవడంతో అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఆబ్‌సెంట్‌ వేశారు. దీంతో ఉదయం వాగ్వాదానికి దిగిన వలంటీర్లు మధ్యాహ్న భోజన సమయంలో తమ అనుచరుడు వీరా సాయంతో సచివాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేశామని నగరి ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:04:46+05:30 IST