పండ్ల టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-15T06:39:58+05:30 IST

చిత్తూరులో పండ్ల నాణ్యతను పరిశీలించే టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది

పండ్ల టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభం

చిత్తూరు(వ్యవసాయం), డిసెంబరు 14: జిల్లాలో మామిడి, పండ్ల పరిశ్రమల యాజమాన్యాలు, వ్యవసాయ కోర్సులు చదివే విద్యార్థులకు టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా మామిడి పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు గోవర్ధన బాబి అన్నారు. సోమవారం నగరంలోని వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయ సమీపంలో పండ్ల టెస్టింగ్‌ల్యాబ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. గోవర్ధన మాట్లాడుతూ.. పండ్ల నాణ్యతా పరిశీలనలో పల్ప్‌ ఫ్యాక్టరీలకు ల్యాబ్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పండ్ల పరిశ్రమల సంఘం గౌరవాధ్యక్షుడు కట్టమంచి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:39:58+05:30 IST