నేటి నుంచి 7వ తరగతి విద్యార్థుల బడిబాట

ABN , First Publish Date - 2020-12-14T05:03:21+05:30 IST

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 7వ తరగతి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు.

నేటి నుంచి 7వ తరగతి విద్యార్థుల బడిబాట

చిత్తూరు(సెంట్రల్‌) డిసెంబరు 13: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 7వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం దశల వారీగా తరగతుల నిర్వహణకు అనుమతులిస్తోంది. ఇప్పటికే 8, 10 విద్యార్థులు హాజరవుతుండగా, సోమవారం నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఈ నేపథ్యంలో పాఠశాల గదుల శానిటైజేషన్‌ తదితర కారణాలతో 7వతరగతి విద్యార్థులను మాత్రమే అనుమతిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. 

Updated Date - 2020-12-14T05:03:21+05:30 IST