రాబోయే రోజుల్లో తిరుపతే రాజధాని: గంగుల

ABN , First Publish Date - 2020-12-29T14:56:55+05:30 IST

ఏపీ విభజన సమయంలోనే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని గతంలోనే సోనియాకు లేఖ రాశానని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

రాబోయే రోజుల్లో తిరుపతే రాజధాని: గంగుల

తిరుమల: ఏపీ విభజన సమయంలోనే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పాటు చెయ్యాలని గతంలోనే సోనియాకు లేఖ రాశానని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అయితే తన లేఖపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని...దీంతో ఇక్కడ కాంగ్రెస్ నామరూపాలు  లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సంక్రాంతి తరువాత పలువురు ముఖ్య నాయకులతో కలిసి గ్రేటర్ రాయలసీమలో పర్యటిస్తామని తెలిపారు. భవిష్యతులో ఇది మహోద్యమంగా రూపాంతరం చెందుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రానికి తిరుపతే రాజధాని అవుతుందని గంగుల ప్రతాప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-29T14:56:55+05:30 IST