టీడీపీకి మాజీ ఎమ్మెల్యే‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-06-04T16:48:16+05:30 IST

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే‌ రాజీనామా

నేడు మీడియా సమావేశంలో ప్రకటన 


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ టీడీపీకి రాజీనామా చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తన స్వగృహంలో జరిగే మీడియా సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాననీ, ఆపై ఏ పార్టీలో చేరే నిర్ణయం చెబుతానని ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన వివరించారు. 1994లో చిత్తూరు పట్టణ టీడీపీ కన్వీనర్‌గా పని చేసిన మనోహర్‌ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీకేబాబుపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1995లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలోకి దిగి రాష్ట్రంలోనే అత్యధికంగా 26వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీకేబాబుపై రెండోమారు పోటీ చేసి ఓడిపోయినా, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్‌ లభించకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా సేవలందిస్తూ వస్తున్నారు.

Updated Date - 2020-06-04T16:48:16+05:30 IST