గిట్టుబాటు ధర కల్పించేందుకే రైతు బజారు
ABN , First Publish Date - 2020-05-17T10:57:52+05:30 IST
దళారుల ప్రమేయం లేకుండా తాము పండించిన పంటను నేరుగా విక్రయించుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర

శ్రీకాళహస్తి, మే 16: దళారుల ప్రమేయం లేకుండా తాము పండించిన పంటను నేరుగా విక్రయించుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతోనే రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు బజారును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రైతు బజారులో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి గోవిందు, సిబ్బంది పాల్గొన్నారు.