ఎమ్మెల్యేకి కరోనా అంటూ పుకార్లు

ABN , First Publish Date - 2020-06-26T21:45:21+05:30 IST

చిత్తూరు జిల్లాలో ఓ శాసనసభ్యుడికి, ఆయన అనుచరులకు కరోనా సోకిందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయనతో పాటు విజయవాడకు వెళ్లిన మరో ముగ్గురికి కూడా కరోనా

ఎమ్మెల్యేకి కరోనా అంటూ పుకార్లు

తిరుపతి/చిత్తూరు (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఓ శాసనసభ్యుడికి, ఆయన అనుచరులకు కరోనా సోకిందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయనతో పాటు విజయవాడకు వెళ్లిన మరో ముగ్గురికి కూడా కరోనా లక్షణాలున్నాయని ప్రచారం జరగ్గా  వైద్యులు వారం క్రితం ఆయన నివాసానికి వెళ్లి శ్వాబ్‌ పరీక్షలు జరిపినట్టు సమాచారం. ఎమ్మెల్యేకు నెగటివ్‌ ఫలితంగా రాగా, ఆయన ముగ్గురు అనుచరుల్లో ఒకరికి మాత్రం మైల్డ్‌ ఫలితం వెలువడ్డట్టు తెలుస్తోంది. అతనికి కూడా హోం క్వారంటైన్‌ తర్వాత నెగటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే.. తనకు నలతగా ఉందనడం, ఉన్నట్లుండి బెంగళూరుకు వెళ్లడంతో అక్కడ చికిత్స చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆయన బుధవారం తన నివాసంలోనే కాపు నేస్తంపై మాట్లాడారు.  సమీక్ష సమావేశంలో కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-26T21:45:21+05:30 IST