మరోనెల ఖైదీల బెయిళ్ల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-04-26T10:58:08+05:30 IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా సబ్‌జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 72 మంది ఖైదీలకు ఈనెల 2వతేది బెయిల్‌ మంజూరు చేశారు.

మరోనెల ఖైదీల బెయిళ్ల గడువు పొడిగింపు

చిత్తూరు సిటీ, ఏప్రిల్‌ 25: కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా సబ్‌జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 72 మంది ఖైదీలకు ఈనెల 2వతేది బెయిల్‌ మంజూరు చేశారు. వీరందరూ ఈనెలాఖరున ఆయా సబ్‌జైళ్ల అధికారుల వద్ద హాజరు కావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ 72 మంది బెయిళ్ల గడువును మే 31వతేదీ దాకా పొడిగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులందినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి శనివారం పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-26T10:58:08+05:30 IST