సత్యవేడు సెజ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌పై విచారణ

ABN , First Publish Date - 2020-12-19T07:18:38+05:30 IST

సత్యవేడు సెజ్‌-2కు గతంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన జి. సాయినాఽథ్‌తో పాటు మరో ఐదుగురిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సత్యవేడు సెజ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌పై విచారణ

కలికిరి, డిసెంబరు 18: సత్యవేడు సెజ్‌-2కు గతంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన జి. సాయినాఽథ్‌తో పాటు మరో ఐదుగురిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సెజ్‌-2లో జరిగిన అవకతవకలకు సంబంధించి విజిలెన్స్‌ అధికారులకు లభించిన ఆధారాల మేరకు ఈ ఆరుగురిపై అభియోగాలు నమోదు చేసిన అనంతరం వాటికి సంబంధించి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. అనంతరం విచారణ చేపట్టడానికి విచారణాధికారిని నియమిస్తూ జీవో నెం. 963, విచారణాధికారికి ప్రభుత్వం తరపున సహకరించేందుకు ప్రెజెంటింగ్‌ అధికారిని నియమిస్తూ మరో జీవో నెం. 964ను శుక్రవారం జారీ చేశారు. 

Read more