-
-
Home » Andhra Pradesh » Chittoor » elephants staying in konerukuppam
-
కోనేరుకుప్పం వద్ద ఏనుగుల గుంపు
ABN , First Publish Date - 2020-12-10T05:41:27+05:30 IST
శాంతిపురం మండలం కోనేరు కుప్పం సమీపంలోని నీలగిరి చెట్ల తోపులో బుధవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది.

శాంతిపురం, డిసెంబరు 9: శాంతిపురం మండలం కోనేరు కుప్పం సమీపంలోని నీలగిరి చెట్ల తోపులో బుధవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు, రైతులు, ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం విశ్వనాథపురం అటవీప్రాంతం నుంచి మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు శాంతిపురం మండలంలోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం అటవీ క్షేత్రాధికారి మధుసూదన్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఏనుగులను చూసేందుకు వచ్చిన జనాన్ని అక్కడి నుంచి పంపివేశారు. ఏనుగులను కర్ణాటకలోని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు కర్ణాటక అడవిలోకి వెళ్లేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటీవీ అధికారి మధుసూదన్ కోరారు.