కరోనాపై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-03-13T11:20:55+05:30 IST

కరోనాపై అనవసర ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా అన్నారు.

కరోనాపై ఆందోళన వద్దు

మాస్కులు అవసరం లేదు : కలెక్టర్‌

 

 చిత్తూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కరోనాపై అనవసర ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా అన్నారు. చిత్తూరులో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ నెల్లూరులోని 42, 47 వార్డుల్లో రెండు కరోనా కేసులను గుర్తించారని ఆ ప్రాంతాల్లోని 20 వేల మంది ప్రజలను స్కీనింగ్‌లో ఉంచారని తెలిపారు. ఎక్కడ కరోనా కేసును గుర్తించినా..చుట్టూ మూడు కిలోమీటర్లు బఫర్‌జోన్‌గా ప్రకటిస్తారని తెలిపారు.


ప్రస్తుతానికి మన జిల్లా వరకు అందరూ మాస్కులు ధరించాల్సిన అవసరం అయితే లేదు. మాస్కులు అడ్వయిజబుల్‌ కాదు కూడా. ఎవ్వరైనా విదేశాల నుంచి వస్తే 28 రోజులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. కుటుంబ సభ్యులు కూడా వారికి ఒక మీటరు దూరంలో ఉండాలి. ఈ విధానాన్ని ప్రభుత్వం ‘పబ్లిక్‌ హెల్త్‌ సేఫ్టీ యాక్ట్‌’ కింద కొత్తగా తీసుకొచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మన జిల్లాకు 65 మంది విదేశాల నుంచి వచ్చారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆశ కార్యకర్తలతో విచారిస్తున్నాం అని కలెక్టర్‌ వివరించారు.

Updated Date - 2020-03-13T11:20:55+05:30 IST