మహిళా సంరక్షణకు ఐసీడీఎస్ చేయూత
ABN , First Publish Date - 2020-04-26T10:57:43+05:30 IST
మహిళా సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెం.181కు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి.

చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 25: మహిళా సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెం.181కు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వన్‌స్టా్‌ప సఖీ(దిశా) కేంద్రం, గృహహింస రక్షణ విభాగం(డొమెస్టిక్ వయొలెన్స్(డీవీ)సెల్) సేవలను మహిళలకు 24 గంటలూ అందుబాటులో ఉంచినట్లు ఐసీడీఎస్ పీడీ ఉషా ఫణికర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శారీరక, మానసిక, లైంగికహింసకు గురవుతున్న బాధితులు ఆయా కేంద్రాల ద్వారా వైద్య, న్యాయ తదితర సేవలను ఉచితంగా పొందవచ్చని సూచించారు. మహిళలు నెం.181కు, సఖీ వన్‌స్టా్‌ప సెంటర్ నెం.8074269239, 9959776697, గృహహింస రక్షణ విభాగం నెం.9550952646, లీగల్ కౌన్సిలర్ నెం.8977600407కు ఫిర్యాదు చేయవచ్చని పీడీ కోరారు.