ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా?
ABN , First Publish Date - 2020-07-08T11:29:08+05:30 IST
ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా? అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ ప్రశ్నించారు. పేదలకు స్థానికంగానే ఇళ్లు కేటాయించాలంటూ

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ
తిరుపతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా? అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ ప్రశ్నించారు. పేదలకు స్థానికంగానే ఇళ్లు కేటాయించాలంటూ మంగళవారం తన నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుతం జనావాసాల మధ్య పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే, సీఎం జగన్ ప్రభుత్వం కొండల్లో, గుట్టల్లో, నిరుపయోగమైన స్థలాలిచ్చేందుకు సిద్ధమవడం తగదన్నారు.
తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్లస్థలాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగంలేదన్నారు. గతంలో పేదలకోసం నిర్మించిన గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, బ్యాంకు శాంతమ్మ, రామ్మూర్తి రాయల్, ఊట్ల సురేంద్ర నాయుడు, చినబాబు, మునిశేఖర్ రాయల్, మక్కీ యాదవ్, రుద్రకోటి సదాశివం, ఆర్పీ శ్రీనివాస్, మైనం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.