ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు విక్రయించొద్దు
ABN , First Publish Date - 2020-04-26T10:56:50+05:30 IST
ప్రిస్ర్కిప్షన్ లేకుండా దుకాణదారులు మందులు విక్రయించరాదని వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ ఆదేశించారు.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 25: ప్రిస్ర్కిప్షన్ లేకుండా దుకాణదారులు మందులు విక్రయించరాదని వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ ఆదేశించారు. శనివారం ఆయన విజయవాడ నుంచి వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌వోలు, డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు మూడురోజుల్లోగా అన్ని మందుల దుకాణాల వివరాలను ఫార్మసీ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని సూచించారు. వచ్చేనెల ఒకటి నుంచి జూన్ 30వతేదీలోగా ఎంసీహెచ్(మీన్ కార్ప్‌సక్యులర్ హిమోగ్లోబిన్) కీమోథెరఫీ, బ్లడ్ ట్రాన్స్‌మ్యుటేషన్, డయాలసిస్, పొందుతున్న వ్యక్తుల జాబితాను 108 సర్వీసులకు అనుసంధానం చేయాలన్నారు.