పంచాయతీల ‘విభజన’ నిలిపివేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-03-15T11:44:42+05:30 IST

ల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన 38 గ్రామ పంచాయతీల విలీన, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను హైకోర్టు సోమవారం వరకు

పంచాయతీల ‘విభజన’ నిలిపివేసిన హైకోర్టు

 చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 14: జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన 38 గ్రామ పంచాయతీల విలీన, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలో లేక వాయిదా వేయాలో తెలియని పరిస్థితిలో జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు పడ్డారు. ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 32 మండలాల్లోని 195 గ్రామ పంచాయతీల్లో విలీనాలు,  పునర్వ్వవస్థీకరణలు జరిపి నూతనంగా 38 పంచాయతీలు ఏర్పాటు చేసింది.


వీటికి సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా విభజన, పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటికే 10 పంచాయతీల్లో ఎన్నికలు ఇదివరకే నిలిపివేసారు. తాజాగా పంచాయతీల విభజన ప్రక్రియపై సోమవారం వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కారణంగా 38 కొత్త పంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్‌ పడినట్లేనని భావిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 15న, 17న విడుదల చేయనున్న నోటిఫికేషన్లలో ఆయా పంచాయతీల పేర్లపై సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై డీపీవో సాంబశివారెడ్డిని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఉత్వర్వులు అందాల్సి వుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్య చేపడతామన్నారు. 

Updated Date - 2020-03-15T11:44:42+05:30 IST